‘స్కంధ’ తేడా కొట్టిందో.! శ్రీలీల అంతే సంగతి.!

- September 08, 2023 , by Maagulf
‘స్కంధ’ తేడా కొట్టిందో.! శ్రీలీల అంతే సంగతి.!

ప్రస్తుతం శ్రీలీలకు టాలీవుడ్‌లో పిచ్చ పిచ్చగా క్రేజ్ వుంది. ఆ క్రేజ్‌తోనే అమ్మడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్లిపోతోంది. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పట్టేస్తోందీ అందాల భామ.

అంతా బాగానే వుంది కానీ, వచ్చే వారం శ్రీలీల నుంచి ‘స్కంధ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి బజ్ బాగానే వుంది ఇప్పటికైతే. 

శ్రీలీల పేరు చెప్పి.. ఇంకాస్త పాజిటివిటీ కూడా నెలకొంది సినిమాకి. అయితే, బోయపాటి శీనును ఎంతవరకూ నమ్మగలం.? అన్ని టైములూ అనుకూలంగా వుండవు కదా..
‘అఖండ’ సినిమాతో పెద్ద హిట్ కొట్టిన డైరెక్టరే కాదనలేం.
కానీ, ఆయన కెరీర్‌లోనూ ‘వినయ విధేయ రామ’ వంటి డిజాస్టర్లు కూడా వున్నాయని గుర్తు అట్టేపెట్టుకోవాలి మరి. 
'వినయ విధేయ రామ’ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ ఏ రేంజ్‌లో వచ్చిందో అప్పట్లో అందరికీ తెలిసిందే.

తీరా రిజల్ట్ చూస్తే తుస్సు.. ఏదో రామ్ చరణ్ సినిమా కాబట్టి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా 70 కోట్లు కొల్లగొట్టేసిందీ సినిమా. కానీ, రామ్ సినిమాకి లక్కు రివర్స్ అయ్యి తేడా కొట్టిందో.. అంతే సంగతి. అంత క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల పని కూడా అవుట్ అంతే.! చూడాలి మరి, ఏం జరుగుతుందో.. మరో వారం రోజుల్లో తేలిపోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com