మెగా ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.?
- September 08, 2023
‘సీతారామం’ బ్యూటీకి మెగా ఛాన్స్ దక్కిందా.? నిజమేనా.? ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసిందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు.
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ పేరు పరిశీలిస్తున్నారట.
దాదాపు ఫిక్స్ అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, తండ్రి వయసున్న హీరోతో నటిస్తావా.? అంటూ సోషల్ మీడియాలో మృణాల్‌పై బోలెడంత నెగిటివిటీ నడుస్తోంది.
ఏమ్.! చేస్తే తప్పేంటంట.! శృతి హాసన్ నటించినప్పుడు లేనిది.. మృణాల్ చేస్తే ఏంటీ.! అంటూ కొందరు మృణాల్‌ని సపోర్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం మృణాల్ చేతిలో విజయ్ దేవరకొండ సినిమా ఒకటి, నేచురల్ స్టార్ నాని సినిమా ఒకటి వున్నాయ్. జరుగుతున్న ప్రచారం నిజమై చిరంజీవి సినిమా కూడా లిస్టులో వుంటే, మృణాల్ లక్కు నక్క తోక తొక్కినట్లే సుమా.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







