అరెస్ట్ తర్వాత చంద్రబాబు
- September 09, 2023
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని సమాచారం.
అరెస్ట్ తర్వాత చంద్రబాబు మీడియా తో మాట్లాడారు. తన అరెస్టు మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారంటూ అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని, తాను తప్పు చేస్తే నిరూపించాలని సవాలు విసిరారు. తాను ప్రజల తరపున న్యాయంగా పోరాడుతున్నానని, చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.
తాను ప్రజాసమస్యలపై పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!







