జీ20 సదస్సులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాన మోడీ
- September 09, 2023
న్యూఢిల్లీ: భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢీల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోడీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో మోడీ మొరాకోలో సంభవించిన భూకంపంపై స్పందించారు.
మొరాకోలో భూకంపం సంభవించడం చాలా విరాచకరమని ప్రధాని మోడీ అన్నారు. భూకంపంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు.
కాగా, ‘‘మొరాకో భూకంపం అనేక మందిని బలిగొనడం విచారకరం. ఈ కష్ట సమయంలో బాధితుల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని జీ-20 సదస్సు ముందు మోడీ పోస్ట్ చేశారు. ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవారు కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు చేయగలిగిందంతా చేసేందుకు భారత్ రెడీగా ఉందని భరోసా కల్పించారు.
ఇక జీ-20 లో కొత్తగా ఆఫ్రికన్ యూనియన్ కూడా వచ్చి చేరింది. జీ20 దేశాల నేతలు అందరూ సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆదివారంతో ఈ సదస్సు ముగుస్తుంది. దీనికంటే ముందు అన్ని దేశాలతో కూడిన ఉమ్మడి డిక్లరేషన్ విడుదల కానుంది. సదస్సులో భాగంగా చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన అంశాలకు ప్రకటనలో చోటు లభిస్తుంది. ఈ సదస్సుతో జీ-20కి భారత నాయకత్వం ముగుస్తుంది. 2024 సంవత్సరానికి గాను బ్రెజిల్ జీ-20 అధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తుంది. 2025లో దక్షిణాఫ్రికా ఈ బాధ్యతలు నిర్వహించనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







