మొరాకో భూకంపం.. ప్రపంచ దేశాల సంఘీభావం

- September 10, 2023 , by Maagulf
మొరాకో భూకంపం.. ప్రపంచ దేశాల సంఘీభావం

మొరాకో: పర్యాటకుల హాట్‌స్పాట్ మరాకేష్ సమీపంలో వినాశకరమైన భూకంపం సంభవించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, దౌత్యవేత్తలు శనివారం మొరాకోకు సంతాపం, మద్దతును ప్రకటించారు. మొరాకో అధికారుల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి సంభవించిన 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కనీసం 1000కిపైగా మంది మరణించారు. వందలాది మంది గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. ఖతార్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకుల నుండి మొరకోకు మద్దతు లభించింది. అమీర్ HH షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మొరాకో రాజ్యం HM కింగ్ మొహమ్మద్ VI, మొరాకో ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

యూరప్
మొరాకో భూకంపం గురించిన వార్తలు చూసి షాక్ అయినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్  తెలిపారు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొరాకో పొరుగు దేశం స్పెయిన్‌కు చెందిన ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్.. "ఈ భయంకరమైన భూకంపం నేపథ్యంలో మొరాకో ప్రజలకు తన సంఘీభావం . స్పెయిన్ బాధితులకు అండగా ఉంటుంది." అని తెలిపారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ "మా ఆలోచనలు ఈ వినాశకరమైన భూకంపం బాధితుల కోసం ఆవేదనతో ఉన్నాయి. బాధిత వారందరికీ మా సానుభూతి తెలియజేస్తున్నాం" అని ప్రకటించింది. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మాట్లాడుతూ.. భూకంపం వార్తలు తనను బాధించాయన్నారు. ఈ అత్యవసర పరిస్థితిలో మొరాకోకు మద్దతు ఇవ్వడానికి ఇటలీ సుముఖంగా ఉందన్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ భయంకరమైన భూకంపం నేపథ్యంలో మొరాకో ప్రజల పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. EU దౌత్యవేత్త జోసెఫ్ బొరెల్ మొరాకోకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. స్విస్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.  బెల్జియం ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ మాట్లాడుతూ "ఈ కష్టమైన క్షణాలలో" తమ దేశం మొరాకోకు అండగా నిలుస్తుందని అన్నారు.

రష్యా, ఉక్రెయిన్

రష్యా మరియు ఉక్రెయిన్ రెండు దేశాల నాయకులు కూడా తమ సానుభూతిని తెలిపాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ "భయంకరమైన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన మొరాకో ప్రజలందరికీ తన ప్రగాఢ సానుభూతిని" వ్యక్తం చేశారు. "ఈ విషాద సమయంలో ఉక్రెయిన్ మొరాకోకు సంఘీభావంగా నిలుస్తుంది" అని అతను సోషల్ మీడియాలో చెప్పారు.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొరాకో రాజుకు పంపిన సందేశంలో "మేము స్నేహపూర్వక మొరాకో ప్రజల బాధను పంచుకుంటామని,  సంతాపాన్ని తెలిపారు" అని పేర్కొన్నారు.

భారతదేశం, టర్కీ
ఈ వారాంతంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, "మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను" అని అన్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్.. ఈ కష్ట సమయంలో మా మొరాకో సోదరులకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామన్నారు.

మిడిల్ ఈస్ట్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్, "ఈ క్లిష్ట సమయంలో మేము మొరాకో రాజ్యానికి అండగా ఉంటాము.బాధిత వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని అన్నారు.  సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా భూకంపం తర్వాత తమ సంతాపాన్ని, మద్దతును తెలియజేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.

 ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ అధిపతి, మౌసా ఫకీ మహమత్.. మొరాకో రాజ్యాన్ని తాకిన భూకంపం విషాదకరమన్నారు. మొరాకో రాజుకు, ప్రజలకు మరియు కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసారు. జెడ్డాకు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహీమ్ తాహా బాధితులకు సంఘీబావం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ భూకంపాన్ని "హృదయ విదారకంగా" అభివర్ణించారు. "తక్షణ ఆరోగ్య అవసరాలకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము." అని ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com