న్యూ ఢిల్లీ G20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్

- September 10, 2023 , by Maagulf
న్యూ ఢిల్లీ G20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్

న్యూఢిల్లీ: భారతదేశంలోని న్యూఢిల్లీలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల G20 లీడర్స్ సమ్మిట్‌కు సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వం వహించారు. న్యూఢిల్లీలోని శిఖరాగ్ర వేదిక వద్దకు చేరుకున్న యువరాజుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. సమ్మిట్ ప్రారంభ సెషన్‌లో పాల్గొనే వివిధ దేశాల నుండి వచ్చిన నాయకులు మరియు ప్రతినిధి బృందాల అధిపతులతో ఆయన కలిసారు. క్రౌన్ ప్రిన్స్‌తో పాటు హాజరైన వారిలో ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఆర్థిక మంత్రి మహ్మద్ అల్-జదాన్ ఉన్నారు.

G20 లీడర్స్ సమ్మిట్ అనేది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల నాయకులు క్లిష్టమైన ప్రపంచ సమస్యలు, ఆర్థిక విధానాలు మరియు సహకార కార్యక్రమాల గురించి చర్చించే ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశం. సౌదీ అరేబియా ప్రతినిధిగా.. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉనికి అంతర్జాతీయ సహకారం, ఆర్థిక దౌత్యానికి రాజ్యం స్టాండ్ ను వివరించారు. మహమ్మారి అనంతర కాలంలో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పుల తగ్గింపు, స్థిరమైన అభివృద్ధి మరియు భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా విస్తృత శ్రేణి అంశాలను సమ్మిట్ లో భాగంగా చర్చించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com