యూఏఈని ఇండియా, సౌదీ అరేబియా, యూఎస్‌లకు కలిపే కొత్త షిప్పింగ్, రైల్ కారిడార్
- September 10, 2023
యూఏఈ: భారతదేశాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్, యుఎస్‌లకు అనుసంధానించే షిప్పింగ్ మరియు రైలు కారిడార్‌ను జి20లో నాయకులు ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో శనివారం ఈ ప్రధాన ప్రకటన వెలువడింది. యుఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ మీడియాతో మాట్లాడుతూ.. కారిడార్ ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల రవాణాను మెరుగుపరచడం ద్వారా పాల్గొనే దేశాల మధ్య ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని అన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్ G20లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామిగా, పెట్టుబడిదారుగా వాషింగ్టన్ ను నిలపాలన్న ప్రణాళికలలో ఇది భాగమన్నారు. దౌత్యపరమైన చిక్కులకు అతీతంగా, ఇటువంటి అవస్థాపన ఒప్పందం షిప్పింగ్ సమయం, ఖర్చు, డీజిల్ వినియోగాన్ని తగ్గించగలదని.. వాణిజ్యాన్ని వేగంగా మరియు చౌకగా చేయగలదని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!