హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం

- September 10, 2023 , by Maagulf
హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్: హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలర్ట్ అయ్యారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరవాసులకు కీలక సూచనలు చేశారు. వీలైనంతవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్పబయటకు రావొద్దన్నారు. వర్షాలతో ఏదైనా సమస్యలు ఎదురైతే GHMC-DRF సాయం కోసం కంట్రోల్ రూమ్‌ నెంబర్లకు(040-21111111, 9000113667) కాల్ చేయాలని మేయర్ కోరారు. మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, ఈవీడీఎం బృందాలు క్షేత్రస్థాయిలో ఉండాలని మేయర్ ఆదేశించారు.

ఆదివారం(సెప్టెంబర్ 10) సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్మేశాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది.

అటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 24 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు పడతాయంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com