లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా..
- September 11, 2023
చెన్నై: తమిళ్ లో ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. వరుసగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు విజయ్ తో లియో సినిమా తీస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అన్ని సినిమాలు హిట్ అవ్వడం, సీనియర్ హీరోలని కొత్తగా చూపించడం, ఒక సినిమాకి ఒకటి లింక్ పెట్టి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడం.. దీంతో తమిళ్ లోనే కాక లోకేష్ సినిమాలకు సౌత్ అంతా ఫిదా అయిపోయారు.
తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ 171వ సినిమాని అధికారికంగా ప్రకటించారు. లోకేష్ లియో తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ సీక్వెల్, కార్తీతో ఖైదీ సీక్వెల్, సూర్యతో రెండు సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. రజినీకాంత్ సినిమా ఉండొచ్చు అని చెప్పాడు కానీ ఎప్పుడో చెప్పలేదు. సడెన్ గా లోకేష్ – రజిని కాంబినేషన్ లో సినిమా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవలే రజినీకాంత్ జైలర్(Jailer) సినిమాతో భారీ హిట్ కొట్టారు. తమిళ్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సెట్ చేశారు.
దీంతో లోకేష్ -రజిని కాంబోలో సినిమా ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని రజినితో జైలర్ నిర్మించి హిట్ కొట్టిన సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా మొదలవ్వడానికి కొంచెం సమయం పడుతుందని సమాచారం. ప్రస్తుతం లోకేష్ లియో పనుల్లో ఉండగా, రజిని కాంత్ తన 170వ సినిమా త్వరలో మొదలుపెట్టనున్నారు. కమల్ హాసన్ కి విక్రమ్ లాంటి భారీ గ్రాండ్ కంబ్యాక్ సినిమా ఇచ్చిన లోకేష్ ఇక రజినీకాంత్ కి ఎలాంటి సినిమా ఇస్తారో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!







