కేరళలో దారుణం...
- September 11, 2023
తిరువంతపురం: కేరళలోని తిరువంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడి వద్ద మూత్రం ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు బాలుడిని కారుతో తొక్కించి చంపాడు మరో వ్యక్తి. కట్టకడలో 15 ఏళ్ల ఆదిశేఖర్ అనే బాలుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఆగస్టు 30వ తారీఖున ఆ బాలుడు తన స్నేహితులతో ఆడుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూవాచల్లోని లింకోడ్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎలక్ట్రిక్ కారు అతడిని ఒక్క సారిగా ఢీకొట్టింది. పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడే ఒక ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదం కాదు హత్య అని అనిపించే సీసీ కెమెరాల విజవాల్స్ లభించాయి.
వివరాల్లోకి వెళితే.. ఆదిశేఖర్ కు దూరపు బంధువైన 41 ఏళ్ల ప్రియరంజన్ విదేశాలలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామానికి వచ్చారు. గత నెలలో ఒక రోజు మద్యం మత్తులో స్థానిక దేవాలయం ముందు ప్రియరంజన్ మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆదిశేఖర్ గమనించి.. ఇదేం పని అని అతడిని నిలదీశాడు. అక్కడ మూత్ర విసర్జన చేయకూడదని హెచ్చరించాడు. ఇక, ప్రియరంజన్ కు కోపం వచ్చింది.. దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. మంచి సమయం కోసం ఎదురుచూశాడు. అయితే, ఆదిశేఖర్ ఆగస్టు 30వ తేదీన సైకిల్ పై వెళ్తూ కనిపించాడు. ఇదే కరెస్ట్ టైం అనుకున్న ప్రియరంజన్.. ఆ బాలుడిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారును బాలుడిపైకి ఎక్కించాడు. ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటనను హత్యగా నిర్ధారించారు. అనంతరం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రియరంజన్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కట్టకాడ పోలీసులు తెలిపారు.అలాగే బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







