‘జైలర్’ ఇంపాక్ట్.! సీనియర్ హీరోలపై చాలా గట్టిగానే.!
- September 13, 2023
ఇటీవల రిలీజైన ‘జైలర్’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటూ విడుదైన ‘భోళా శంకర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ధియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ‘జైలర్’ గత వారం ఓటీటీలోనూ విడుదలై అక్కడా మంచి టాక్ తెచ్చుకుంది. సీనియర్ హీరో రజనీకాంత్ ఫ్యాన్స్‌కే కాదు, ‘జైలర్’ చూశాకా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ సినిమాని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు.
అవును నిజమే.! ఈ తరహా సినిమాల్లో మన సీనియర్ హీరోలు మరిన్ని సినిమాల్లో నటిస్తే బావుంటుంది కదా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
రీసెంట్గా చిరంజీవి కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారట. డాన్సులేసి.. ఫైట్లు చేసి కష్టపడిపోవడం కాదు.. ‘జైలర్’ మాదిరి డిగ్నిటీ చెడకుండా. సీనియారిటీ తెగకుండా.. ఆడియన్స్ మెచ్చే ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌తో సినిమాలు చేస్తే బావుంటుందని భావిస్తున్నారట. ఈ మార్పు మంచిదే. మొత్తానికి ‘జైలర్’ సినిమా సీనియర్ హీరోలపై కొత్త ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చేమో.!
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









