సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయం.. ముఠాకు జైలు శిక్ష
- September 16, 2023
యూఏఈ: సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయాలు చేస్తున్న నేరస్థుల ముఠాకు జైలు శిక్ష పడింది. ఫెడరల్ క్యాపిటల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ కరెన్సీ విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు ప్రారంభించింది. అసలు కరెన్సీ విలువపై 50 శాతం వరకు రాయితీ ఇస్తానని నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు వారిని సంప్రదించిన సమయంలో డెలివరీ కోసం ఒక స్థలాన్ని చెబుతారు. నిందితులు నకిలీ కరెన్సీని బాధితులకు అంటగట్టి బదులుగా నిజమైన యూఏఈ దిర్హామ్‌లను తీసుకుని పారిపోతుంటారు. ముఠా చేతుల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ లైసెన్స్ పొందిన అధికారుల ద్వారా మాత్రమే కరెన్సీలను పొందాలని, వ్యక్తులను నమ్మవద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









