బాలభారతి పాఠశాల విద్యార్థులకు 10 లక్షల విరాళం అందించిన తానా ఫౌండేషన్
- September 16, 2023
అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా నాలుగవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని తానా ఫౌండేషన్ సహకారంతో కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ అందించింది. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ₹10 లక్షల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి శుక్రవారం సెప్టెంబర్ 15 నాడు అందజేశారు. అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తానా బోర్డు సభ్యులు, కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్నబాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ స్పూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా బాలభారతి పాఠశాలకు వస్తూ ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం పదిహేను వందలకు పైగా గ్రామీణ విద్యార్థులకు పారితోషికాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిధులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో పొదుపుసంఘం మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. స్వయంకృషితో ఎదిగి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విశేషసేవలందిస్తున్నశశికాంత్ వల్లేపల్లి వంటివారు అందరికీ ఆదర్శమని మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని బాలభారతి పాఠశాల ప్రధానోపాద్యాయుడు క్లెమెంట్ సత్యంబాబు, వైస్ ప్రిన్సిపాల్ సవ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ నర్సింహా రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సందడి మధు, తానా సభ్యుడు చందు భసూత్కర, పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కమిటీ కార్యవర్గం విజయలక్ష్మి, తాజానిష, పద్మావతమ్మ, ఐక్యసంఘంకు చెందిన నాలుగువేల మందికి పైగా మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







