చియా గింజలతో అందం ఆరోగ్యం మీ సొంతం సుమా.!
- September 16, 2023
చియా (Chia Seeds) గింజలు కొందరు సబ్జా గింజలు అని కూడా అంటారు. వీటిని ప్రతీ రోజూ వాటర్‌లో నానబెట్టి తాగితే అందంతో పాటూ, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది.
చర్మం కాంతివంతంగా మారడంతో పాటూ, అసవరమైన కొలెస్ర్టాల్ కరిగిపోతుంది. అంతేకాదు, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్ ఈ చియా గింజలతో.
రాత్రంతా నానబెట్టిన చియా గింజల్ని ఉదయం లేచిన వెంటనే కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక శాతం ఫైబర్ వుండడం వల్ల మలబద్దకం నివారంచబడుతుంది.
అలాగే అధిక రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. గుండె జబ్బు సమస్యలు దరి చేరవు. జీవ క్రియ వృద్ధి చెందడంతో పాటూ, కడుపులో మంట, వికారం వంటి సమస్యలు ఏమైనా వుంటే తీరిపోతాయ్.
చియా గింజల నీటిని రోజూ రెగ్యులర్‌గా తాగడం వల్ల కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. అలా అని ఎటువంటి నీరసం దరి చేరదు. ఈ గింజల్లోని ఫైబర్ శరీరానికి తగిన తక్షణ శక్తినందిస్తుంది. తద్వారా అధిక బరువు వున్నవాళ్లు ఈజీగా సన్నబడే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి