ఉత్తమ నటిగా శ్రీలీల.! భలే ఛాన్స్ కొట్టేసింది కానీ.!
- September 16, 2023
టాలీవుడ్లో శ్రీలీల ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. స్టార్ హీరోయిన్ అనే కన్నా.. క్రేజీ హీరోయిన్ అనాలేమో. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటోంది.
అయితే, ఇంతవరకూ ‘ధమాకా’ సినిమా మాత్రమే శ్రీలీల కెరీర్ బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాతోనే ఈ రేంజ్ క్రేజ్ దక్కింది శ్రీలీలకి. ఇప్పుడీ సినిమాతోనే ఉత్తమ నటి అవార్డు కూడా దక్కిచేసుకుంది శ్రీలీల.
అసలే బోలెడంత క్రేజ్ నడుస్తోంది ప్రస్తుతం ఈ తెలుగమ్మాయ్‌కి. ఇక, ఉత్తమ నటి అవార్డు కూడా దక్కిందంటే, ఇంతకన్నా ఎంకరేజ్మెంట్ ఇంకేముంటుంది.
తాజాగా ప్రకటించిన సైమా అవార్డుల్లో శ్రీలీలకి ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్‌కి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. అయితే, శ్రీలీలకి ఈ అవార్డు దక్కడం పట్ల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయ్.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా రెగ్యులర్‌గా వుంటుంది. జస్ట్ ఓ కమర్షియల్ హీరోయిన్ పాత్ర అంతే అది. అలాంటిది.. శ్రీలీలకు ఈ సినిమాతో ఉత్తమ నటి అవార్డు దక్కడమేంటని కొందరు మేథావులు విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







