బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా లో జాక్‌‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్‌..

- September 17, 2023 , by Maagulf
బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా లో జాక్‌‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్‌..

అబుధాబి: బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్  గెలుచుకున్నాడు. అతడు కొనుగోలు చేసిన లాటరీ నంబర్. 141484కి ఈ జాక్‌పాట్ తగిలింది. ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్ కుమార్ గత 10 సంవత్సరాల నుంచి మస్కట్‌లో ఉంటున్నాడు. సహోద్యోగులు, స్నేహితుల ఇలా పది మందితో కలిసి గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నాడు. చివరికి అతనికి అదృష్టం వరించడంతో భారీ మొత్తం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ.. "చాలా సంతోషంగా ఉంది. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని హర్షం వ్యక్తం చేశారు. తాను గెలిచిన ప్రైజ్‌మనీ తో హైదరాబాద్‌లో బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com