అవునా.! రవితేజ అలా చేస్తున్నాడా.?

- September 19, 2023 , by Maagulf
అవునా.! రవితేజ అలా చేస్తున్నాడా.?

మాస్ రాజా రవితేజాకి సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘ధమాకా’ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ అయితే లేదనే చెప్పాలి. అయినా కానీ, రవితేజ సినిమాలు చేయడం ఆపట్లేదు.
 
నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు వెనుకాడడం లేదు. వరుసగా ప్రాజెక్టులు ఒప్పుకుంటూ పోతున్నాడు. రిలీజ్ చేస్తున్నాడు. ఫెయిల్ అవుతున్నాయ్. 

అయినా కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికీ రవితేజ చేతిలో అరడజను వరకూ కొత్త ప్రాజెక్టులున్నాయ్. ప్రధమంగా చెప్పుకోదగ్గవి ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ చిత్రాలు ప్రస్తుతం టాక్‌లో వున్నాయ్.

సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేసుకుంటూ పోవడానికి కారణం ఆయా నిర్మాణ సంస్థల్లో రవితేజ కూడా పెట్టుబడులు పెట్టడమేనట. 

ఆ రకంగా నిర్మాతలకు భరోసా లభించడంతో రవితేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారట. అదీ మాస్ రాజా సీక్రెట్. మాస్ రాజానా.! మజాకానా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com