జ్యుయెలరీ దొంగల ముఠా పట్టివేత

- May 20, 2016 , by Maagulf
జ్యుయెలరీ దొంగల ముఠా పట్టివేత



ఏడుగురు సభ్యులు గల దొంగల ముఠాపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి, ట్రయల్‌కి తరలించారు. ఈ ముఠాలో ఐదుగురు కొలంబియన్స్‌, ఇద్దరు సుడానీస్‌ ఉన్నారు. విల్లాలను దొంగతనం చేయడంలో వీరు దిట్ట. విల్లాల్లో ఎవరూ లేని సమయం చూసి, ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది. జుమైరాలోని ఓ పాకిస్తానీ మహిళకు చెందిన విల్లాపై కన్నేసిన దుండగులు, ఆ విల్లాపై దాడి చేశారు. విలువైన వస్తువుల్ని, నగదుని దొంగలించారు. కేసు విచారించిన పోలీసులు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు దొంగల్ని గుర్తించారు. దొంగలంతా నిరుద్యోగులుగా పోలీసులు తేల్చారు. అజ్మన్‌లోని ఓ స్టోర్‌లో దొంగతనానికి అవసరమైన వస్తువుల్ని దుండుగులు కొనుగోలు చేశారని పోలీసు అధికారి వివరించారు. దొంగిలించిన వస్తువుల విలువ 1,055,000 దిర్హామ్‌లు అని పోలీసులు వివరించారు. ఈ కేసులో తీర్పు జూన్‌ 13న వచ్చే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com