సౌదీ అరేబియాకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ
- September 23, 2023
యూఏఈ: సౌదీ అరేబియా 93వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సోదర సంబంధాన్ని ప్రదర్శించే హృదయపూర్వక వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. "రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ ప్రజలకు వారి 93వ జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందనలు. సౌదీ అరేబియా నిరంతరం పురోగతి సాధించాలి." అని ఆకాంక్షించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సౌదీకి తన అభినందనలను తెలుపుతూ ట్విటర్ (ఎక్స్) లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









