ఈయూ-మిడ్ ఈస్ట్-ఇండియా కారిడార్ ప్రాజెక్ట్‌కు బహ్రెయిన్ మద్దతు

- September 24, 2023 , by Maagulf
ఈయూ-మిడ్ ఈస్ట్-ఇండియా కారిడార్ ప్రాజెక్ట్‌కు బహ్రెయిన్ మద్దతు

బహ్రెయిన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు ఇజ్రాయెల్‌తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వే మరియు ఓడరేవు సౌకర్యాలను అనుసంధానించే ప్రతిపాదనకు బహ్రెయిన్ మద్దతును ప్రకటించింది. ఇది భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేయగలదని, ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కీలకంగా మారుతుందని పేర్కొంది. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెబ్బై ఎనిమిదవ సెషన్‌లో ప్రసంగించిన సమయంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. "ప్రజలందరి ప్రయోజనం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి,  శ్రేయస్సుకు దోహదపడే ఈ ప్రతిష్టాత్మక వ్యూహాత్మక ప్రాజెక్ట్ కోసం మేము ఎదురుచూస్తున్నాము," అని డాక్టర్ అల్ జయానీ అన్నారు.   న్యూఢిల్లీలో గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రారంభించబడిన భారతదేశం-మిడిల్ ఈస్ట్ -యూరోప్ ఆర్థిక కారిడార్‌ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com