ఖుషి’ ఎఫెక్ట్.! శివ నిర్వాణకు ఆ మెగా ప్రాజెక్ట్ మిస్ అయ్యిందా.?
- September 25, 2023
‘ఖుషి’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో శివ నిర్వాణ ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. ఓ స్టోరీ లైన్ చరణ్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ, చరణ్ నుంచి ఫైనల్ రెస్పాన్స్ రాలేదట శివ నిర్వాణకి.
ఇదంతా ‘ఖుషి’ నిర్మాణం జరుగుతున్న టైమ్‌లో జరిగింది. కానీ, రిలీజ్ తర్వాత ‘ఖుషి’ ఎఫెక్ట్‌తో శివ నిర్వాణ మళ్లీ చరణ్‌ని కలిసే సాహసం చేయలేకపోతున్నాడట.
దాంతో, దాదాపుగా ఈ ప్రాజెక్ట్ శివ నిర్వాణ చేయి జారిపోయిందని అంటున్నారు. అయితే, శివ నిర్వాణ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడట. కానీ, తాను అనుకున్న సబ్జెక్ట్ రామ్ చరణ్‌తో కాదు, మరో మెగా కాంపౌండ్ హీరోతో తెరకెక్కించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్. ఆయనతో సినిమా అంటే.. అంచనాలు ఆ స్థాయిలోనే వుంటాయ్. సో, శివ నిర్వాణ కాస్త వెనక్కి తగ్గాడేమో అంటున్నారు. ‘ఖుషి’ ఎఫెక్ట్ అటు విజయ్ దేవరకొండపైనే కాదు, శివ నిర్వాణపైనా అంత గట్టిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మరి.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం