రామ్ ‘స్కంధ’.! ఈ జోరు సరిపోతుందా.!
- September 25, 2023
‘వారియర్’ సినిమా తర్వాత రామ్ పోతినేని నుంచి వస్తున్న సినిమా ‘స్కంధ’. భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించబడింది ఈ సినిమా. బోయపాటి శీను ‘అఖండ’ విజయం తర్వాత రూపొందిస్తున్న సినిమా కావడంతో, అంచనాలు బాగున్నాయ్.
అయితే, ప్రమోషన్లు ఆశించిన రేంజ్లో జరుగుతున్నట్లు కనిపించడం లేదు. మరి కొద్ది రోజుల్లోనే అంటే ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, ఆ స్థాయిలో సినిమాకి బజ్ క్రియేట్ కాలేదు.
ఈ నేపథ్యంలోనే సినిమాపై క్రియేట్ అయిన ఈ లో హైప్ కారణంతో ‘స్కంధ’ ప్యాన్ ఇండియా రిలీజ్ లేదంట.. అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఈ మధ్య చాలా సినిమాలు ఇలాగే ప్యాన్ ఇండియా అని అనౌన్స్ చేసి తీరా రిలీజ్ టైమ్‌కి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయ్.
ఇకపోతే, ‘స్కంధ’ విషయానికి వస్తే, తెలుగు రాష్ర్టాల్లో రిలీజ్ గురించి మాట్లాడుకోవల్సి వచ్చినా సరే, ప్రమోషన్లలో జోరు ఇంకాస్త పెంచాలన్నది ఆడియన్స్ అభిప్రాయం. బిగ్‌బాస్ రియాల్టీ షోకి గెస్ట్‌గా వచ్చి తనదైన శైలిలో రామ్ తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు.
శ్రీలీల తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా వుంది. మరి, డైరెక్టర్ బోయపాటి ఎక్కడ.? మిగిలిన ఈ నాలుగైదు రోజుల్లోనైనా ‘స్కంధ’ ప్రమోషన్లు హోరెత్తించాలని రామ్ ఫ్యాన్స్ కోరుతున్నారట. చూడాలి మరి ఏం చేస్తారో.!
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..