చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.!
- September 25, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా స్టార్ట్ అయ్యాకనే, కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా రిలీజ్ అవ్వడం.. ఆ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ కావడం జరిగింది. దాంతో, అనుకోని కారణాలతో కొంత మేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన ‘భారతీయుడు 2’ ప్రాజెక్ట్‌ని శంకర్ తిరిగి పట్టాలెక్కించడం.. ఆ కారణంగా రామ్ చరణ్ సినిమాని పక్కన పెట్టడం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ పూర్తయిపోయిందట. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోవడంతో నిర్మాణానంతర పనులు జరుపుకుంటోందట ‘ఇండియన్ 2’.
ఇక, ఇప్పుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ని తిరిగి కొత్త షెడ్యూల్‌తో ప్రారంభించబోతున్నారట. ఈ షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారట. మరో నాలుగైదు రోజుల్లోనే ఈ నయా షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారనీ తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో తెలుగుతో పాటూ, తమిళ, మలయాల, హిందీ తదితర భాషల నుంచి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం