బహ్రెయిన్-సౌదీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- September 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజ్యం, సౌదీ అరేబియా రాజ్యం మధ్య బలమైన చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి విదేశాంగ మంత్రి డా. అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ కృతజ్ఞతలు తెలిపారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ల తెలివైన నాయకత్వంలో రెండు దేశాలు సాధించిన పురోగతి, అభివృద్ధిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. డా. అల్ జయానీ సౌదీ అరేబియా 93వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సన్నిహిత చారిత్రక సంబంధాలను గుర్తు చేసారు. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సహ-అధ్యక్షునిగా ఉన్న సౌదీ-బహ్రెయిన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ కార్యక్రమాలను కూడా మంత్రి ప్రశంసించారు. రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక, మీడియా, పర్యాటకం, సామాజిక, పెట్టుబడులు మరియు పర్యావరణ సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు రెండు ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేస్తున్నా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







