అయోధ్య రామ మందిరం: డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి...
- September 26, 2023
లక్నో: అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడంతస్తుల ఈ ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి కల్లా పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండవచ్చని అన్నారు. జనవరి 20 నుంచి 24 మధ్య ఏరోజైనా ప్రాతిప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఇంకా తెలియజేయలేదని చెప్పారు.
ఆలయ నిర్మాణ పనులపై మిశ్రా మాట్లాడుతూ, ఆలయ శిఖరానికి సంబంధించిన డిజైన్ వర్క్ జరుగుతోందని, ఏటా శ్రీరామనవమి రోజున గర్భాలయంలోని దేవతా విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారని చెప్పారు. బెంగుళూరులో శిఖర నిర్మాణం జరుగుతోందని, సైటింస్ట్‌లు పర్యవేక్షణలో డిజైన్ వర్క్ జరుగుతోందన్నారు. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పుణెలోని మరో ఇన్‌స్టిట్యూట్ కలిసి కంప్యూటరైజ్జ్ ప్రోగ్రాం రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, అయోధ్య రామాలయం రామ్‌లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు లాంఛనంగా ఆహ్వానించనుంది. జనవరి 14వ తేదీ మకర సంక్రాతి తర్వాత రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనుంది. పదిరోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. ప్రాణప్రతిష్ఠ అనంతరం జనవరి 24 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించే వీలుంది. కాగా, ప్రాణప్రతిష్ఠకు ఎందర్ని ఆహ్వానించనున్నారని అడిగినప్పుడు, సాధువులు, సంతులు, రామాలయ ఉద్యమంతో ముడిపడిన వ్యక్తులతో సహా 10,000 మందితో ప్రాథమిక జాబితా సిద్ధం చేస్తున్నామని మిశ్రా తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల