యూఏఈ వాసులకు గుడ్ న్యూస్.. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- September 27, 2023
యూఏఈ: యూఏఈ వాసులకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. 75,000 టన్నుల మేర బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని యూఏఈకి ఎగుమతి చేసేందుకు అనుమతించింది. జూలై 20 నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధిం విధించిన విషయం తెలిసిందే. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా యూఏఈకి ఎగుమతులు అనుమతించబడుతున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సోమవారం సాయంత్రం తన నోటిఫికేషన్లో తెలిపింది. సింగపూర్‌కు “ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి” బియ్యం ఎగుమతిని అనుమతించాలని గత నెలలో భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్, యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్, చైనా, కోట్ డి ఐవోయిర్, టోగో, సెనెగల్, గినియా, వియత్నాం, జిబౌటి, మడగాస్కర్, కామెరూన్ సోమాలియా, మలేషియా మరియు లైబీరియాలు బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







