అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో సౌదీ కీలక ఒప్పందం
- September 27, 2023
వియన్నా: అణు నైపుణ్యం, సహకారానికి సంబంధించి అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా జూనియర్ ప్రొఫెషనల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ అందనుంది. కింగ్ అబ్దుల్లా సిటీ ఫర్ అటామిక్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (KACARE) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీతో జూనియర్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్‌పై సంతకం చేశారు. వియన్నాలో జరిగిన IAEA జనరల్ కాన్ఫరెన్స్ 67వ రెగ్యులర్ సెషన్ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందం IAEAకి సంబంధించిన వివిధ సాంకేతిక రంగాలలో యువ జాతీయ ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







