రెస్ట్ తీసుకుంటున్న ప్రబాస్.! కారణమేంటంటే.!
- September 27, 2023
‘ఆది పురుష్’ సినిమా తర్వాత ప్రబాస్ నుంచి రావాల్సిన చిత్రాలు చాలానే వున్నాయ్. ముఖ్యంగా ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు. సెప్టెంబర్‌లో ‘సలార్’ రిలీజ్ కావల్సి వుండగా, పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘సలార్’ షూటింగ్ పార్ట్ అయితే, పూర్తి చేసేశాడట ప్రబాస్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీ అయ్యింది. ఈ లోగా ప్రబాస్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడట. అందుకు కారణం ఆయన మోకాలి సర్జరీ.
గత కొన్నాళ్లుగా ప్రబాస్ మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ‘ఆది పురుష్’ టైమ్‌లోనే ఆయన కాలి సర్జరీ చేయించుకోబోతున్నారట అని వార్తలు వచ్చాయ్. కానీ, ‘సలార్’ షూట్ కోసం ఆగిపోయారు. కాలి గాయంతోనే ‘సలార్’ షూటింగ్ పూర్తి చేసేశారాయన.
ఇక, తాజాగా ఆయన మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. నవంబర్ నుంచి తిరిగి షూటింగుల్లో పాల్గొనబోతున్నారట. ‘కల్కి’ కోసం ఎక్కువగా డేట్లు కేటాయించారట ప్రబాస్. వీలైనంత త్వరగా ఆ సినిమా పూర్తి చేయబోతున్నారట. అలాగే, మారుతి డైరెక్షన్లో ప్రబాస్ చేయబోయే హారర్ మూవీని కూడా సైమల్టేనియస్‌గా పూర్తి చేయాలనుకుంటున్నారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







