ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీలో రోబోట్‌తో లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్
- September 28, 2023
రియాద్: రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (KFSH&RC) రోబోట్‌ను ఉపయోగించి మొత్తం కాలేయ మార్పిడిని చేయడంలో విజయం సాధించింది. ఈ తరహా ఆపరేషన్లలో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) మరియు హెపాటోసెల్యులర్ కార్సినోమా (HCC)తో బాధపడుతున్న 60 ఏళ్ల సౌదీ రోగికి విజయవంతమైన మార్పిడి ఆపరేషన్ జరిగింది. KFSH&RCలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డైటర్ బ్రూరింగ్.. లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందానికి నాయకత్వం వహించారు. కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ప్రపంచంలోని ప్రధాన ఆసుపత్రులలో ఒకటి. ఇటీవల ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సంస్థల జాబితా 2023లో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో మొదటి స్థానంలో.. ప్రపంచ వ్యాప్తంగా 20వ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







