సౌదీ అరేబియాలో తొలి లూసిడ్ కార్ల ఫ్యాక్టరీ ప్రారంభం
- September 28, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో మొట్టమొదటి కార్ల తయారీ కేంద్రాన్ని లూసిడ్ గ్రూప్ బుధవారం అధికారికంగా ప్రారంభించింది. సౌదీ మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ ముఖ్యఅతిథిగా పాల్గొని తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియా విజన్ 2030కి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ పరిశ్రమ, సరఫరా గొలుసు విస్తరణ మరియు సాంకేతిక రంగంలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. అనంతరం లూసిడ్ CEO పీటర్ రాలిన్సన్ మాట్లాడుతూ.. ఇది లూసిడ్ రెండవ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని (AMP-2), సౌదీ మార్కెట్ లో అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను దీనిలో తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు మరింత సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కారును అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









