బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..52 మంది మృతి
- September 29, 2023
కరాచీ: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి.
మృతుల్లో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఈ ఘటన ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది.మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ కారు వద్దే పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఓ సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









