ఆరోగ్యకరమైన గుండె కోసం 10 చిట్కాలు
- September 29, 2023
వరల్డ్ హర్ట్ డే(సెప్టెంబరు 29) సందర్భంగా గుండె ఆరోగ్యంగా ఉంచుకునేందుకు డాక్టర్లు సూచనలు చేశారు. జీవనశైలి గుండె ఆరోగ్యంపై ప్రధానంగా ప్రభావం చూపుతుందని చెప్పారు. యూఏఈలో ఇటీవలి సంవత్సరాలలో యువకులు గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. హైదరాబాద్ లోని విజయ మెడికల్ మరియు హార్ట్ క్లినిక్ ఎం.డి డాక్టర్ చిత్తర్వు మధు పలు సూచనలు చేశారు.
- వారానికి 150 నిమిషాల మితమైన ఇంటెన్సిటీ వ్యాయామం చేయాలి. ఎందుకంటే శారీరక వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన గుండె ఆరోగ్యానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి. వ్యాయామం మీ రక్తపోటు మరియు రక్త ప్రసరణకు సహాయం చేయడంతో పాటు మీ బరువు మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇప్పుడే ధూమపానం మానేయాలి, పొగాకు ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన కారణం.
- దంతవైద్యుడిని సందర్శించాలి.. నోటి ఆరోగ్యం,గుండె సంబంధ వ్యాధుల ప్రమాదానికి మధ్య లింక్ ఉందని రుజువు అయింది. డెంటల్ ఇన్ఫెక్షన్ కారణంగా టీత్ నష్టంతోపాటు పీరియాంటైటిస్ అరిథ్మియా, గుండె ఆగిపోవడం, స్ట్రోక్ మరియు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
- చీకటి చల్లని గదిలో నిద్రించాలి. ప్రతి రాత్రి 7-9 గంటల మంచి నాణ్యమైన నిద్ర పోవాలి. నిద్రపోయేముందు కనీసం ఒక గంట ముందు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు కనీసం మూడు గంటల ముందు భోజనాన్ని పూర్తి చేయాలి. నిద్ర జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- బరువును గమనించాలి. బరువు పెరగడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
- ఒత్తిడి స్థాయిలపై దృష్టి పెట్టాలి. అధిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిరూపించబడింది. కాబట్టి ఒత్తిడికి దూరంగా యోగ, ధ్యానం లాంటివి చేయాలి.
- పోషకమైన అల్పాహారంలో తాజా పండ్లు, లీన్ ప్రోటీన్లు (గుడ్లు, పెరుగు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు) మరియు సంక్లిష్ట తృణధాన్యాలు తీసుకోవాలి.
- చక్కెర తీసుకోవడం తగ్గించాలి. సహజమైన మరియు అధిక-నాణ్యత కలిగిన స్వీటెనర్లు (తేనె, డార్క్ చాక్లెట్) శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన స్వీట్ల కంటే మంచివి.
- కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకోవాలి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









