ఖతార్ లో దూసుకుపోతున్న గూగుల్ క్లౌడ్

- September 30, 2023 , by Maagulf
ఖతార్ లో దూసుకుపోతున్న గూగుల్ క్లౌడ్

దోహా: ఈ ఏడాది ప్రారంభంలో ఖతార్‌లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ క్లౌడ్ అనతికాలంలోనే రీజియన్, డిజిటల్ రంగంలో దూసుకుపోతుందని  గూగుల్ క్లౌడ్ ఖతార్ కంట్రీ మేనేజర్ ఘసన్ కోస్టా చెప్పారు. దోహా క్లౌడ్ రీజియన్ వ్యాపారాలు , ప్రభుత్వ రంగం ఆవిష్కరణల ద్వారా దేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సహాయపడుతుంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) హోస్ట్ చేసిన రెండవ ఖతార్ సైబర్ అస్యూరెన్స్ కాన్ఫరెన్స్ ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు తమ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి వారి సంస్థలకు సరైన డేటా స్ట్రాటజీ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీలను రూపొందించడానికి తాము వారికి మద్దతుగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ సదస్సు సందర్భంగా గూగుల్ నేషనల్ ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ (NIA) సర్టిఫికేషన్ పొందింది. ఖతార్‌లో గూగుల్ క్లౌడ్‌ని పూర్తి స్థాయిలో అందించడం, అవసరమైన అన్ని ధృవపత్రాలను పాటించడం కోసం ఈ సర్టిఫికేట్ " సూచిస్తుందని కోస్టాస్ అన్నారు. 2023 - 2030 మధ్య ఖతార్ ఆర్థిక వ్యవస్థకు అధిక స్థూల ఆర్థిక ఉత్పత్తిలో $18.9 బిలియన్లను అందించగలదని అంచనా వేస్తున్నారు. అదే విధంగా 2030 నాటికి 25,000 ఉద్యోగాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.  ఖతార్‌లో భవిష్యత్ ప్రాధాన్యతలపై వ్యాఖ్యానిస్తూ.. ఖతార్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో సంతకం చేసిన అనేక ఒప్పందాలను అమలు చేయడానికి గూగుల్ ప్రాధాన్యత ఇస్తుందని కోస్టాస్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com