సోషల్ మీడియాలో పోలీసులపై కామెడీ.. ఏడుగురు అరెస్ట్

- September 30, 2023 , by Maagulf
సోషల్ మీడియాలో పోలీసులపై కామెడీ.. ఏడుగురు అరెస్ట్

సౌదీ అరేబియా: సోషల్ మీడియాలో పోలీసులను కామెడీగా చూపించిన ఘటనకు సంబంధించి సౌదీ అరేబియా అధికారులు 7 మందిని అరెస్టు చేశారు. నివాసితులు ఒక వాణిజ్య దుకాణంలో స్థానిక పోలీసులను హాస్యాస్పదంగా అనుకరిస్తూ వీడియోను రూపొందించారు. తమ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసమే ఇలాంటి కంటెంట్‌ను రూపొందించినట్లు నిందితులు విచారణలో తెలిపారు. అరెస్టయిన ఏడుగురిలో ఐదుగురు సౌదీ పౌరులని, మరో ఇద్దరు అరబ్ సంతతికి చెందిన వారని అధికారులు తెలిపారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించి, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com