హై బీపీని లైట్ తీసుకుంటున్నారా.? అంతే సంగతి.!
- October 01, 2023
బీపీ లేదా రక్తపోటు ఏదైనా కానీ, ఎక్కువైనా తక్కువైనా డేంజరే. కానీ, ఎక్కువ మంది అధిక రక్తపోటు సమస్యతోనే బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడి చేశాయ్.
జస్ట్ బీపీనే కదా.. అని అస్సలు లైట్ తీసుకోరాదట. ఒక్కసారి హై బీపీ అని టెస్ట్‌లో వైద్యులు నిర్ధారించిన తర్వాత. వైద్యుని సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటూ, జీవన శైలిలోనూ మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.
మంచి ఆహారం తీసుకోవడం.. ప్రతీరోజూ వ్యాయామం చేయడం తప్పని సరి. అలాగే, మనసు ప్రశాంతంగా వుంచుకోవడం అనేది బీపీ పేషెంట్ల మొదటి తక్షణ కర్తవ్యం. నిజానికి ఇదే అసలు సిసలు ప్రాధమిక మెడిసెన్‌గా చెబుతున్నారు.
అధిక రక్తపోటు సమస్య కారణంగా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ముఖ్యంగా రక్తపోటు ఎక్కువైతే కిడ్నీలు ఫెయిలవుతాయ్. అలాగే పక్షవాతం, గుండెనొప్పి.. చివరకు మరణం కూడా సంభవించొచ్చు.
బీపీ అనగానే ముందుగా ఉప్పు తినడం మానేయాలి అంటుంటారు. కానీ, ఉప్పు వాడకం తగ్గించాలి తప్ప.. పూర్తిగా మానేయకూడదు. పూర్తిగా మానేసినా అది మరో సమస్యకు దారి తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







