'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో శిల్పా యోగా తరగతులు
- May 21, 2016
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఐఎఫ్‌ఏ) అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి యోగా తరగతులు నిర్వహించనుంది. ఈ విషయంపై శుక్రవారం శిల్పాశెట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజూ ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్నారు. యోగా తరగతులు నిర్వహించడానికి ఐఫా ఒక చక్కని వేదిక అని అభిప్రాయపడ్డారు. ఐఫా బృందం ప్రతి ఏడాది సరికొత్తగా ఉంటూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోందన్నారు. వచ్చే నెల స్పెయిన్‌లో 17వ ఐఫా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 23 నుంచి 26 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హాతో పాటు పలువురు తారలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







