ప్రధాని మోదీని కలిసిన టిమ్‌కుక్
- May 21, 2016
భారత పర్యటనలో ఉన్న యాపిల్ అధినేత టిమ్‌కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. దిల్లీలోని 7 రేస్‌కోర్స్ రోడ్లో గల ప్రధాని అధికారిక నివాసంలో టిమ్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ మొబైల్ యాప్' అప్డేటెడ్ వెర్షన్‌ను టిమ్ ప్రారంభించారు.
భేటీ అనంతరం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ, టిమ్‌కుక్ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. టిమ్ చేతుల మీదుగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు టిమ్‌కుక్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు మరోసారి రావాలనుందంటూ టిమ్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







