మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్

- May 21, 2016 , by Maagulf
మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ' మొబైల్ యాప్ ను కుక్ విడుదల చేశారు. టిమ్ కుక్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, భారత్ లో పర్యటించడం పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.అందుకు సమాధానం ఇచ్చిన కుక్ త్వరలో మరోసారి ఇండియాకు రావడానికి ఇప్పటినుంచి ప్రణాళికలు తయారుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన అప్ డేటెడ్ యాప్ లో వాలంటరీంగ్ సంబంధించిన సరికొత్త వివరాలున్నాయని వెల్లడించారు. కుక్ చేతుల మీదుగా యాప్ రిలీజ్ కావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com