కువైట్ లో 34 మంది భారతీయ నర్సులు విడుదల
- October 05, 2023
కువైట్: కువైట్ నగరంలోని ఒక ప్రసిద్ధ క్లినిక్‌లో నిర్వహించిన భద్రతా పరమైన దాడిలో భాగంగా గత 23 రోజులుగా నిర్బంధంలో ఉన్న సుమారు 60 మంది కార్మికులను కువైట్ బుధవారం విడుదల చేసింది. ఇందులో 34 మంది భారతీయ నర్సులు ఉన్నారు. వారిలో చాలా మంది గత 3 నుండి 4 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. భారత ఉన్నతాధికారుల జోక్యంతో విడుదల కార్యక్రమం సాఫీగా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరెస్టయిన వారి బంధువులు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్.. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సాయంతో భారతీయుల విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









