ఏడాది చివరి వరకు చమురు ఉత్పత్తిలో స్వచ్ఛందంగా కోత: సౌదీ

- October 05, 2023 , by Maagulf
ఏడాది చివరి వరకు చమురు ఉత్పత్తిలో స్వచ్ఛందంగా కోత: సౌదీ

రియాద్: రోజుకి ఒక మిలియన్ బ్యారెల్ (బిపిడి) స్వచ్ఛంద ముడి చమురు ఉత్పత్తి కోతను 2023 సంవత్సరం చివరి వరకు పొడిగించినట్టు సౌదీ అరేబియా బుధవారం వెల్లడించింది. ఇంధన మంత్రిత్వ శాఖలోని అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ నెలలో మరియు సంవత్సరం చివరి వరకు ఒక మిలియన్ బిపిడి స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోతను కొనసాగిస్తుందని, వచ్చే నెలలో నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించనున్నట్లు ప్రకటించారు.నవంబర్ మరియు డిసెంబర్‌లలో కింగ్‌డమ్ ఉత్పత్తి సుమారుగా 9 మిలియన్ బిపిడి ఉంటుందని సౌదీ మంత్రిత్వ శాఖ తెలిపింది.  సౌదీ అరేబియా మొదట జూలైలో అదనపు స్వచ్ఛంద కోతను అమలు చేసింది.  ఆ తర్వాత నెలవారీ ప్రాతిపదికన పొడిగిస్తూ వస్తుంది. OPECలోని కొంతమంది సభ్యులు 2024 చివరి వరకు ఇతర స్వచ్ఛంద క్రూడ్ అవుట్‌పుట్ క్షీణత రోజుకు 1.66 మిలియన్ బ్యారెల్స్‌కు తగ్గించాలని సూచించింది.  ఇదిలా ఉండగా.. ఆగస్టులో రోజుకు 500,000 బ్యారెల్స్ , సెప్టెంబరులో రోజుకు 300,000 బ్యారెల్స్ ఎగుమతులను స్వచ్ఛందంగా తగ్గిస్తామని రష్యా స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com