బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి.! ఎవరితోనో తెలుసా.?

- October 05, 2023 , by Maagulf
బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి.! ఎవరితోనో తెలుసా.?

అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ‌తో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ టచ్‌లో బిజీగా వుంది ‘భగవంత్ కేసరి’ టీమ్.

ఇదిలా వుంటే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు.? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తోంది.

అనిల్ రావిపూడి ఓ స్టోరీ లైన్‌తో మెగాస్టార్ చిరంజీవిని లాక్ చేసి పెట్టాడన్న ప్రచారం వుంది. అవును నిజమే.. చిరంజీవి కోసం ఓ స్టోరీ లైన్ సిద్ధం చేశారట. అది చిరంజీవికి కూడా బాగా నచ్చేసిందట. కలిసి చేద్దామని అన్నారట.

ఈ ప్రాజెక్ట్‌కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాబోతున్నారట. ‘భగవంత్ కేసరి’ పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేయాలనుకుంటున్నారట అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవి ఇమ్మీడియట్‌గా చేయబోతున్న ప్రాజెక్ట్ ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో. ఇటీవల మోకాలి సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న చిరంజీవి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కోసం సంసిద్ధం కానున్నారు.

చాలా తక్కువ టైమ్‌లోనే ఈ సినిమా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. మరి, వశిష్ట సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్‌ని ముందుగా చిరంజీవి పట్టాలెక్కిస్తారో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com