రెండవ త్రైమాసికంలో తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్

- October 06, 2023 , by Maagulf
రెండవ త్రైమాసికంలో తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్

కువైట్: 2023 రెండవ త్రైమాసికంలో ప్రవాసుల చెల్లింపులు తగ్గాయి. కువైట్ రాష్ట్రం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ జారీ చేసిన చెల్లింపుల బ్యాలెన్స్ డేటా ప్రకారం.. 2023 రెండవ త్రైమాసికంలో ప్రవాసులు చేసిన మొత్తం రెమిటెన్స్‌లు దాదాపు 1.168 బిలియన్ దినార్లు., ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే 5.6 శాతం తగ్గుదల నమోదు అయింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో రెమిటెన్స్ KD 1.22 బిలియన్లుగా రికార్డు అయింది. 2022 రెండవ త్రైమాసికంలో 1.495 బిలియన్ దినార్లు ఉన్న దాని స్థాయితో పోలిస్తే 2023 రెండవ త్రైమాసికంలో సుమారు 21.9 శాతం తగ్గుదల నమోదైందని గణాంకాలు చూపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com