‘చిన్నా’ కలెక్షన్ల హంగామా.! సిద్దార్డ్‌కి ‘బిగ్’ ఛాన్సులే.!

- October 09, 2023 , by Maagulf
‘చిన్నా’ కలెక్షన్ల హంగామా.! సిద్దార్డ్‌కి ‘బిగ్’ ఛాన్సులే.!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ , ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాలతో హీరోగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న హీరో సిద్దార్ధ్. అమ్మాయిల కలల రాకుమారుడు. యూత్‌‌లో ట్రెండ్ సెట్టర్. అయితే, ఈ మధ్య సిద్దార్ధ్‌కి పెద్దగా కలిసి రావడం లేదు.

ఏవేవో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ, అవన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు దక్కించుకోవడం లేదు. దాంతో, దాదాపు సిద్దూని మర్చిపోయారు తెలుగు ప్రేక్షకులు. ఈ టైమ్‌లో ‘చిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని సరికొత్తగా పలకరించాడు సిద్దార్ద్.

ఈ వారమే ధియేటర్లలో సందడి చేసింది ‘చిన్నా’ సినిమా. ఈ సినిమాతో పాటూ, చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయ్ ఈ వారం. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘చిన్నా’ సినిమా ఆడియన్స్‌ని మెప్పించింది. ఓ చిన్న పాపకీ హీరోకీ మధ్య వుండే ఎమోషనల్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు.

అన్నట్లు ఈ సినిమాకి నిర్మాత కూడా సిద్ధార్ధే. మంచి టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు బుల్లితెరపై టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్ గేమ్ షోలో సిద్దార్ద్ గెస్ట్‌గా వచ్చి కంటెస్టెంట్లతో తన సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటూ చేసిన హంగామాతో ఈ సినిమా గురించి ఇంకా బాగా తెలిసింది.

మొత్తానికి బిగ్‌హౌస్‌లో చిన్నాగా సిద్దూ చేసిన అల్లరి, ఇంతవరకూ ఈ సినిమా గురించి తెలియని వాళ్లకు కూడా తెలియ చెప్పేలా చేసింది. దాంతో, ‘చిన్నా’కి కలెక్షన్ల హవా ఇంకాస్త పెరిగేలానే కనిపిస్తోంది చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com