ఉప్పు నీటితో స్నానం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు.!

- October 09, 2023 , by Maagulf
ఉప్పు నీటితో స్నానం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు.!

ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మం నల్లబడుతుందన్న అపోహ వుంది. అయితే, మరీ సముద్రపు ఉప్పు జలాలతో కాదండోయ్. మనం స్నానం చేయబోయే నీటిలోనే కొద్దిగా ఉప్పు వేసుకుని స్నానం చేస్తే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అవును నిజమే ఉప్పులో చాలా యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్. ఇవి చర్మానికి ఎలాంటీ హానీ చేయవు. పైగా డ్రై స్కిన్ సమస్య వున్న వాళ్లు ఈ చిట్కా పాఠిస్తే చర్మం తేమగా వుండి, చర్మంపై మచ్చలేమైనా వుంటే తొలగిపోతాయట. అలాగే ఇతరత్రా చర్మ సమస్యలకూ ఉప్పు నీటి స్నానం మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, కీళ్ల నొప్పులున్న వారు, వేడి వేడి నీటిలో కాస్తంత కళ్లుప్పు (Rock Salt) వేసుకుని స్నానం చేస్తే మంచి ఉపశమనం వుంటుందట. ఉప్పులోని సోడియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి బాగా తోడ్పడతాయని చెబుతున్నారు.

అంతేకాదు, ఉప్పు నీటితో శరీరాన్ని సున్నితంగా మర్దన చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెబుతున్నారు. వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా ఉప్పు నీటి స్నానం ఉపయోగపడుతుందట.

ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య మాయమైపోతుందట. ఉప్పు నీటి స్నానం కారణంగా రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందనీ చెబుతున్నారు. ఇంకెందుకాలస్యం. రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడూ అయినా కాస్త ఉప్పు నీటీ స్నానం చేయడం మర్చిపోకండి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com