సామాజిక భద్రతా పెన్షన్ SR1320కి పెంపు
- October 09, 2023
రియాద్: సామాజిక భద్రతా పింఛను SR1100 నుండి SR1320కి చేరుకునేలా 20 శాతం పెంచుతూ రాయల్ డిక్రీని జారీ చేసినట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు పెంచినట్లు తెలిపింది. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో..వారి ఆర్థిక భారాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్ చైర్మన్ మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన సిఫార్సుకు అనుగుణంగా రాజు పింఛను పెంపు ఆదేశాలను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సామాజిక భద్రత పెన్షన్ పెంపులో అర్హులైన కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ప్రతి కుటుంబానికి పెన్షన్ గరిష్ట పరిమితి SR5000 దాటకుండా జారీ చేస్తారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!