AFC ఆసియా కప్ ఖతార్ 2023 టిక్కెట్ల అమ్మకం ప్రారంభం

- October 10, 2023 , by Maagulf
AFC ఆసియా కప్ ఖతార్ 2023 టిక్కెట్ల అమ్మకం ప్రారంభం

దోహా: దోహాలో జనవరి 12 నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు జరగనున్న AFC ఆసియా కప్ ఖతార్ 2023 టోర్నమెంట్ టిక్కెట్లు అక్టోబర్ 10 నుండి విక్రయించనున్నారు. ఈ మేరకు స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ (LOC) వెల్లడించింది. టిక్కెట్ ధరలు QR25 నుండి ప్రారంభమవుతాయని, అనేక విభిన్న ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని ఆసియా కప్ ఖతార్ 2023 స్థానిక ఆర్గనైజింగ్ కమిటీలో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రబియా అల్ కువారీ తెలిపారు.  టోర్నమెంట్ టిక్కెట్‌లను దశలవారీగా విడుదల చేస్తామని, వాటిని ఫ్యాన్ ఎంట్రీ వీసాలు లేదా హయ్యా కార్డ్‌తో లింక్ చేయరని స్పష్టం చేశారు. 9 స్టేడియంలలో మొత్తం 51 మ్యాచ్‌లు ఆడనున్నారు. వీటిలో 7 గతంలో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022లో ఉపయోగించన స్టేడియాలు ఉన్నాయి. టిక్కెట్లు ఆర్గనైజింగ్ కమిటీ వెబ్‌సైట్, AFC వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com