భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం
- October 12, 2023
ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. దీని కోసం ప్రత్యేక చార్టర్ విమానాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం పాలస్థీనా గ్రూప్ హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దేశంలో 20,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని చెప్పారు.
కేరళ రాష్ట్రానికి చెందిన 7,000 మంది ప్రజలు ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు సీఎం జైశంకర్‌కు లేఖ రాశారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 84 మంది వ్యక్తుల గురించి తమకు సమాచారం అందిందని తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా అక్టోబర్ 8వతేదీన ముంబయికి తిరిగి వచ్చారు.
యుద్ధం ప్రారంభమైన సమయంలో ఆమె హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









