గుప్పు మనింది. కానీ ‘లియో’కి మెగా పవర్ యాడ్.! ఈ రేంజ్ వేరే లెవల్.!

- October 12, 2023 , by Maagulf
గుప్పు మనింది. కానీ ‘లియో’కి మెగా పవర్ యాడ్.! ఈ రేంజ్ వేరే లెవల్.!

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లియో’ అలాంటిలాంటి సినిమా అనుకోవడానికి వీల్లేదండోయ్. కాస్టింగ్ పరంగా ఈ సినిమాని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటుగు సంజయ్ దత్ విలన్ రోల్ పోషిస్తుండడం ఓ ఇంపార్టెంట్ అస్సెట్.

కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్నారంటూ ఆ నోటా ఈ నోటా గాసిప్ గుప్పు , గుప్పు మనింది. అది గాసిప్ మాత్రమే కాదు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అంటూ ఓ న్యూస్ ట్విట్టర్ (X) హ్యాండిల్‌లో చక్కర్లు కొడుతోంది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు మీద ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాంతో, ఇది కన్‌ఫామ్ న్యూస్ అనుకున్నారంతా. అయితే, అదో ఫేక్ న్యూస్ అనీ, లోకేష్ కనగరాజ్ పేరు మీద ఈ న్యూస్ ఎవరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారనీ అంటున్నారు.

నిజంగానే రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడా.? లేదా.? అనేది చిత్ర యూనిట్ రెస్పాండ్ అయితే కానీ తెలీదు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని విజయ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిస్తున్నారు. కమల్ హాసన్ కూడా ఓ కీలకమైన గెస్ట్ రోల్ పోషిస్తున్నారంటున్నారు.

చూడాలి మరి, ఎంతమంది గెస్ట్‌లు ఏ ఏ రోల్స్ పోషించారో తెలియాలంటే ఈ నెల 19 వరకూ ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com