నుపుర్ సనన్‌‌లో ఆ కళ కనిపిస్తోంది.!

- October 12, 2023 , by Maagulf
నుపుర్ సనన్‌‌లో ఆ కళ కనిపిస్తోంది.!

కృతి సనన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించేసుకుంది. తెలుగులో స్టార్ డమ్ దక్కకపోయినా బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో చెలామనీ అవుతోంది కృతి సనన్.

అయితే, తన చెల్లెలు మాత్రం తెలుగులోనే సక్సెస్ అవ్వాలని కోరుకుంటోందట. మాస్ రాజా రవితేజ హీరోగా వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నుపుర్ సనన్ హీరోయిన్‌గా తెలుగులో డెబ్యూ చేస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో నుపుర్ సనన్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. త్వరలోనే తెలుగులో మాట్లాడేస్తానంటోంది. తెలుగు ట్యూటర్‌ని పెట్టించుకుని తెలుగు బాగా మాట్లాడడం నేర్చుకుంటోందట. సినిమా ప్రమోషన్లలో చిట్టి పొట్టి తెలుగు మాటలు మాట్లాడుతూ ఆడియన్స్ పల్స్ పట్టేస్తోంది. ‘మగధీర’ సినిమా నుంచీ తెలుగు సినిమాలు కూడా చూడడం అలవాటు చేసుకుందట నుపుర్.

ఒకవేళ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా హిట్టయితే నుపుర్ సనన్‌కి తెలుగులో మంచి ప్లేస్ దక్కడం ఖాయమే. ఆమెలో ఆ టాలెంట్ కూడా వుందంటున్నారు. మరి, తప్పటడుగులు వేయకుండా.. ఆచి తూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే అమ్మడు టాలీవుడ్‌లో ఖచ్చితంగా  సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుంది. అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఇప్పటి వరకూ అయితే అంచనాలు బాగానే వున్నాయ్. ఆడియన్స్ తీర్పు ఎలా వుంటుందో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com