కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ

- October 12, 2023 , by Maagulf
కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్: ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్12,2023) ప్రధాని పిథోరాఘడ్ జిల్లాలోని ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులతో తలపాగా ధరించిన ప్రధాని మోదీ పార్వతి కుండ్​లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు.

ఈ పర్యటనలో భాగంగా మోదీ తనదైన శైలిలో స్థానికులను కలిశారు. జగేశ్వర్ ధామ్, సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించారు. స్థానికులతో ముచ్చటించారు. మహిళలతో ఆప్యాయంగా మాట్లాడారు. వారు నమస్కారం చేస్తుంటే మోదీ కూడా నవ్వుతు వారి చేతులు పట్టుకుని మాట్లాడారు. శిరస్సు వంచి నమస్కరించారు మోదీ. ఓ మహిళ మోదీ తలను ఆప్యాయంగా నిమిరారు. అక్కడే ఓ చిన్నారి మోదీ వద్దకు రాగా బాలుడికి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బాబు బుగ్గలు నిమిరి వాత్సల్యాన్ని చూపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com